Karnataka – ఘోర రోడ్డు ప్రమాదం..

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 8 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు చిక్‌బళ్లాపూర్‌ పోలీసు అధికారి […]

Chandrababu Babu – అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నిరసనలు జరిగాయి

చంద్రబాబు అక్రమ అరెస్టుపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా కేంద్రంలో కమ్మ సంఘం కార్యాలయం నుంచి జయప్రకాశ్‌నగర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. తెలుగు సంఘం అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాస్‌, కార్యదర్శి జి.నాగబ్రహ్మేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని పళ్లిపట్టు బస్టాండు వద్ద ఆందోళన నిర్వహించారు. తమిళనాడు తెలుగు భాషా సంరక్షణ సంఘ అధ్యక్షుడు ఎన్‌.రాజేంద్రనాయుడు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. చంద్రబాబును […]

Another historical building in India has entered the list of world heritage buildings – ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్‌లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది

కర్ణాటకలోని ‘హోయసల’ (Hoysala) ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో (UNESCO) వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్‌, హళేబీడ్‌, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ ‘వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ’లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ‘శాంతినికేతన్‌’కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలు ఈ జాబితాలో చేరడం విశేషం. హోయసలకు ఈ గౌరవం దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘యునెస్కో […]

International Constitution Day was celebrated on Friday by the Karnataka government – కర్ణాటక ప్రభుత్వం అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించింది

అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం […]