Gurugram-Jaipur Express – స్లీపర్ బస్సులో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
గురుగ్రామ్-జైపుర్ ఎక్స్ప్రెస్ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో అవి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 12 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఝార్సా ఫ్లై ఓవర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.