Work from home మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్‌!

ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది.  నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్‌ చేస్తూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అభ్యర్థనలను హోరెత్తిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను పునఃప్రారంభించడానికి అనుమతించాలని వారు సీఎంను కోరుతున్నారు. కోవిడ్‌  మహమ్మారి సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని  ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి […]