Israel-Hamas : గాజా ఆసుపత్రిపై దాడి

ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో విలవిల్లాడుతున్న గాజా (Gaza)లో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకొంది. అల్‌ అహ్లి ఆసుపత్రి (Attack on Hospital)లో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో పశ్చిమాసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాగా.. ఈ దారుణానికి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులే కారణమని హమాస్‌ (Hamas) ఆరోపించగా.. దాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ఖండించారు. అది ఉగ్రమూకల దుశ్చర్యే అని దుయ్యబట్టారు. ఐడీఎఫ్‌ కాదు: నెతన్యాహు ‘‘ఈ […]

Israel – హెజ్‌బొల్లా లక్ష్యాలపై దాడులు..!

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా(Hezbollah)కు చెందిన కీలక లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం నేడు దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ ఎక్స్‌ ఖాతాలో కూడా ధ్రువీకరించింది. లెబనాన్‌ నుంచి గత కొన్నాళ్లుగా తరచూ దాడులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా..  రాజకీయ, సైనిక, సామాజిక కార్యక్రమాల్లో చాలా బలంగా ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని అమాయక ప్రజలపై దాడి చేసిన హమాస్‌కు ఇది మద్దతు ప్రకటించింది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్‌ సైనిక పోస్టులపై, ట్యాంక్‌లపై దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ […]

America President – ఇజ్రాయెల్‌లో జో బైడెన్‌ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి!

హమాస్‌ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి! రాబోయే కొన్ని రోజుల్లోనే ఆ దేశానికి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికైతే పర్యటన ఖరారు కాలేదని స్పష్టం చేశాయి. బైడెన్‌ ఇజ్రాయెల్‌కు వెళ్తే.. హమాస్‌ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి అమెరికా బలమైన మద్దతును పునరుద్ఘాటించినట్లవుతుంది. అయితే హమాస్‌ మిలిటెంట్లకు అండగా నిలుస్తున్న ఇరాన్‌కు మాత్రం ఆయన పర్యటన తీవ్ర ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నాయి. […]

War – హమాస్‌, ఇజ్రాయెల్‌ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా

హమాస్‌, ఇజ్రాయెల్‌ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో ముప్పేట దాడి ముప్పు ముంచుకొస్తోంది. ఇటు గాజా నుంచి హమాస్‌ రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది. అటు ఇజ్రాయెల్‌ వైమానిక దాడులను చేస్తూనే ఉంది. గాజా సరిహద్దుల్లో బలగాలను మోహరించి యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇటు లెబనాన్‌వైపూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెల్‌ ఏర్పాటుచేసిన నిఘా కెమెరాలను హెజ్‌బొల్లా ధ్వంసం చేస్తోంది. ఒకవేళ గాజాలో భూతల దాడులకు దిగితే తామూ యుద్ధంలోకి వస్తామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. మరోవైపు గాజాలో ప్రజల […]

Hamas Attack – ఇద్దరు భారత భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల్లో భారత సంతతికి చెందిన కనీసం ఇద్దరు భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరినీ లెఫ్టినెంట్‌ ఓర్‌ మోజెస్‌ (22), పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కిమ్‌ డొక్రాకెర్‌లుగా  గుర్తించారు. విధి నిర్వహణలో వీరిద్దరూ ప్రాణత్యాగం చేసినట్లు బయటపడింది. ఇంతవరకు 286 మంది సైనికులు, 51 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తేల్చారు. మృతులను, అపహరణకు గురైనవారిని గుర్తించే పని కొనసాగుతున్నందువల్ల ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.

Prime Minister – ఇజ్రాయెల్‌ సంక్షోభం వేళ మోదీ వ్యాఖ్యలు..

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని.. మానవ అవసరాలు తీర్చే విధానాలతో కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (P20) ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. అంతర్జాతీయ విశ్వాసానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాల క్రితం (2001లో) […]

Hollywood : ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల్ని ఖండించింది

ఇజ్రాయెల్‌ (Israel) పై హమాస్‌ (Hamas) దాడుల్ని హాలీవుడ్‌ (Hollywood) ఖండించింది. ఉగ్రవాదులు చేసింది ఒక పాశవిక చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని పలువురు సినీ తారలు పిలుపునిచ్చారు. ఈ మేరకు క్రియేటివ్‌ కమ్యూనిటీ ఫర్‌ పీస్‌ సంస్థ రాసిన లేఖపై 700కుపైగా సినీ తారలు సంతకాలు చేశారు. ‘‘హమాస్‌కు చెందిన వ్యక్తులు అమాయక ప్రజల్ని హత్య చేశారు. చిన్న పిల్లల్ని, పెద్దల్ని అపహరించి దారుణంగా చంపేశారు. ఇది ఉగ్రవాదం.. రాక్షసత్వం. […]

Israel – శత్రువుకు శత్రువు మిత్రుడు..

ఈ సూత్రం ఆధారంగానే హమాస్‌కు చేయూతనిచ్చింది ఇజ్రాయెల్‌. పాలస్తీనా ఏర్పాటు లక్ష్యంగా 1950ల చివర్లో ఏర్పడ్డ ఫతా అనే సంస్థ ఇజ్రాయెల్‌పై సాయుధ దాడులకు సిద్ధమైంది. దీని అధిపతి యాసర్‌ అరాఫత్‌. తర్వాతి కాలంలో ఆయన సారథ్యంలోనే అనేక అరబ్‌ గ్రూపులు కలిసి పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌గా (పీఎల్‌వో) ఏర్పడ్డాయి. ఇది మత ఛాందస సంస్థ కాదు. లౌకిక జాతీయవాద, వామపక్ష సంస్థ. 1969లో పీఎల్‌వో ఛైర్మన్‌ అయిన అరాఫత్‌ 2014లో చనిపోయేదాకా ఆ పదవిలో ఉన్నారు. […]

Israel–Palestinian – వివాదం

ఈ నేపథ్యంలో పదుల కొద్దీ అదనపు దళాలను ఇజ్రాయెల్‌ రంగంలోకి దించుతోంది. ఇజ్రాయెల్‌కు అదనపు మద్దతు అందించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాల నేపథ్యంలో ఆ దేశ విమాన వాహక యుద్ధ నౌకలు తదితరాలు తూర్పు మధ్యదరా సముద్రం వైపు తరలాయి. సమీప ప్రాంతాల యుద్ధ విమాన దళాలను కూడా అమెరికా హుటాహుటిన సమీకరిస్తోంది.ఇజ్రాయెల్‌పై దాడి వెనక ఇరాన్‌ హస్తం, ప్లానింగ్‌ ఉన్నట్టు హమాస్, హెజ్బొల్లా నేతలే స్వయంగా వెల్లడించారు. గాజా స్ట్రిప్‌లో 30 మందికి […]