Biden Presenets New Casefire Plan For Israel: ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు కొత్త ఒప్పందం!

ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌: ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్‌ ఇటీవల అంగీకారం తెలిపినట్లు చెప్పారు. హమాస్‌ కూడా దానికి ఆమోదముద్ర వేయాలని కోరారు. బైడెన్‌ […]

Israel Hamas Conflict: గాజాలో యుద్ధం ఆపితే సంధికి సిద్ధమే: హమాస్‌

Israel Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం ఆపితేనే తాము సంధికి వస్తామని హమాస్‌ తేల్చి చెప్పింది. లేదంటే తాము ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనబోమని పేర్కొంది. Israel Hamas Conflict | గాజా: కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్‌ (Hamas) వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని షరతు విధించింది. అప్పటి వరకు తాము ఎలాంటి సంధి చర్చల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఒప్పందం కోసం యత్నిస్తున్న మధ్యవర్తులకు తెలియజేశామని […]

Rafah: రఫా నడిబొడ్డుకు ఇజ్రాయెల్‌

దక్షిణ గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) చొచ్చుకొనిపోతున్నాయి. తొలుత శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. జెరూసలెం: దక్షిణ గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) చొచ్చుకొనిపోతున్నాయి. తొలుత శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో హమాస్‌ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు ఐడీఎఫ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మందుపాతర పేలి ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు బుధవారం ఐడీఎఫ్‌ తెలిపింది. […]

Israel-Hamas Conflict: ఈ ఘోరాన్ని ఇకనైనా ఆపండి.. ఇజ్రాయెల్‌పై ఐరాస మండిపాటు

Israel-Hamas Conflict: రఫాలో ఆదివారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇప్పటికైనా దీన్ని ఆపేయాలని కోరింది. బందీలను విడుదల చేయాలని హమాస్‌కు సూచించింది. Israel-Hamas Conflict | న్యూయార్క్‌: రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్‌ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఘోరాన్ని […]

Israel – కాస్త తగ్గుతోందా..?

హమాస్‌(Hamas)ను భూస్థాపితం చేసేవరకు గాజాపై తమ దాడులు ఆపమన్న ఇజ్రాయెల్(Israel) .. భీకర ఘర్షణలకు ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు మాత్రం ముందుకువచ్చింది. మానవతా సాయం, బందీల విడుదల కోసం గాజాలో వ్యూహాత్మక విరామాలను పరిశీలిస్తామని వెల్లడించింది. (Israel Hamas Conflict) ‘మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి, బందీలను విడిపించేందుకు వ్యూహాత్మక స్వల్ప విరామాలను మా దేశం పరిశీలిస్తోంది’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) తెలిపారు. అమెరికా శ్వేతసౌధ ప్రతినిధి జాన్‌ కిర్బీ […]

Rishi Sunak – ఉగ్రవాదంపై పోరులో మేం ఆ దేశం వెంటే

హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం (Israel Hamas conflict) కొనసాగుతున్న వేళ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (British PM Rishi Sunak) ఇజ్రాయెల్‌ పర్యటన చేపట్టారు. గురువారం ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా టెల్‌అవీవ్‌లో దిగిన ఆయన.. ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భేటీ కానున్నారు. హమాస్‌తో పోరు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్‌కు సునాక్‌ మద్దతు ప్రకటించారు. ‘‘నేను ఇజ్రాయెల్‌లో ఉన్నాను. ఈ దేశం బాధలో ఉంది. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ […]

PM Modi – గాజా ఆసుపత్రి ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel Hamas Conflict) యుద్ధం వేళ..  గాజా (Gaza)లోని ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ‘‘గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిలో పెను ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రస్తుత ఘర్షణల్లో (ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరును ఉద్దేశిస్తూ) […]