Manipur – మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధం 8 వరకు పొడిగింపు
మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్‌పై మణిపుర్‌లో విధించిన నిషేధాన్ని ఈ నెల 8 వరకు పొడిగించారు. మణిపుర్ రైఫిల్స్ శిబిరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ నిషేధాన్ని విధించారు. విద్వేషాన్ని ఎగదోసే సందేశాలు, ఛాయాచిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించవచ్చనే ఉద్దేశంతో దీనిని పొడిగించాలని నిర్ణయించారు. సెప్టెంబరులో కొన్నిరోజులు మినహా మే 3 నుంచి ఎప్పటికప్పుడు నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.