Iran Report: హెలికాప్టర్‌ కూలిపోవడానికి 90 సెకన్ల ముందు.. జరిగింది ఇదే.!

ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేసింది. ఘటన తర్వాత నిపుణుల దర్యాప్తు బృందం సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. నివేదిక ప్రకారం.. హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా నిర్దేశిత మార్గాన్ని దాటి వెళ్లలేదు. ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆ […]

Heavy Rain In Dubai : దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి.

అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యూఏఈలో తీవ్రస్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం. అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. తాజాగా, దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి. అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే […]

Russia-Ukraine war:  రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు.  రష్యా 32 ఇరాన్‌ తయారీ షహీద్‌ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్‌ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Free Passport No Tax & Citizenship : ఫ్రీ పాస్‌పోర్ట్‌, నో ట్యాక్స్‌.. ఓ దేశం బంపరాఫర్‌!

సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు బంపరాఫర్‌ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే ఇలాంటివారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు  ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 41 వేల కోట్లు) సమానం అని ఆయన తెలిపారు. “విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 […]

America Warning To Israel : ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన అమెరికా.. 

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం తెలిపింది జెరూసలెం: యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన ఎరెజ్‌ సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడటం […]

Golden Toilet Theft.. : రూ.50 కోట్ల విలువైన ‘బంగారు టాయిలెట్’‌ చోరీ.. 

ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ కోట్ల విలువైన బంగారు టాయిలెట్‌ కమోడ్‌ని కొట్టేశాడు. దాదాపు 300 ఏళ్ల నాటి బ్లెన్‌హీమ్ అనే ప్యాలెస్ నుంచి దీనిని దొంగిలించాడు. ఈ కమోడ్ విలువ 48,00,000 పౌండ్లు అంటే సుమారు రూ. 50.36 కోట్లు ఉంటుందని ప్రాధమిక అంచనా వేశారు. బంగారు టాయిలెట్‌ను తానే దొంగిలించినట్టు 39 ఏళ్ల జేమ్స్ షీన్ అనే దొంగ అంగీకరించాడు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ […]

Earthquake in Taiwan:  తైవాన్‌లో భూకంపం భారీ విధ్వంసం, 

తైవాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ 7.2 తీవ్రతను నమోదు చేయగా, US జియోలాజికల్ సర్వే 7.4గా పేర్కొంది. భూకంప కేంద్రం హువాలిన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలిన్‌లో భవనాల పునాదులు కదిలాయి. రాజధాని తైపీలో కూడా భూకంపం సంభవించింది. తైవాన్‌లో భూకంపం తర్వాత 3 మీటర్ల (9.8 అడుగులు) వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు అరగంట తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే […]

Israeli airstrikes on Gaza hospital : గాజా తాత్కాలిక ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. డెయిర్‌ అల్‌-బలా: మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పాత్రికేయులతో సహా 15 మంది గాయపడ్డారు. యుద్ధ కల్లోలిత ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందతున్నారు. దాడితో మహిళలు, […]

Indian Embassy Jobs: వీసా ఉంటే చాలు.. రూ. 1.25 లక్షల జీతం!

ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. శాశ్వత, తాత్కాలిక ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్‌ ఎంబసీ ఒక నోటీసును ప్రచురించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రాథమిక అర్హత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి. ఇంకా ఏమేం ఉండాలంటే..ఖతార్‌లోని ఇండియన్‌ ఎంబసీలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 […]

Haiti: Went to interview the gang leader.. గ్యాంగ్‌లీడర్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లి.. బందీగా మారి..!

సాయుధ మూకల దాడులతో కరీబియన్ దేశం హైతీ(Haiti) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అలాంటి చోట ఒక గ్యాంగ్‌ లీడర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన యూట్యూబర్‌ ఒకరు కిడ్నాప్‌ అయ్యారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గ్యాంగ్‌ లీడర్ జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ (Jimmy Cherizier alias Barbecue)ను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్.. హైతీకి వెళ్లాడు. అతడు YourFellowArab పేరిట ఒక ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే ఆ దేశానికి వెళ్లిన కొద్దిగంటల వ్యవధిలో […]

  • 1
  • 2