train accidents – రైలు ప్రమాదాల్లో పరిహారం పెంపు

రైలు ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పదింతలు పెంచుతూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు నుంచే ఇవి అమల్లోకి వచ్చినట్లు లెక్క. 2013లో చివరిసారిగా ఈ మొత్తాలు పెంచారు. కాపలాదారులున్న లెవెల్‌క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకూ ఇది వర్తిస్తుంది. రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం […]

Full fare for children..Rs. 2800 crore revenue for railways – పిల్లలకు ఫుల్‌ ఫేర్‌.. రైల్వేకు రూ.2800 కోట్ల ఆదాయం

రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు (Indian Railways) రూ.2800 కోట్లు అదనపు ఆదాయం సమకూరుంది. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చి ఏడేళ్లు కాగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.560 కోట్లు వచ్చినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆర్‌టీఐ (RTI) దరఖాస్తుకు రైల్వే శాఖ పరిధిలోని సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (CRIS) సమాచారం ఇచ్చింది. రైళ్లలో ఒకప్పుడు 5-12 ఏళ్ల చిన్నారులకు సపరేట్‌ బెర్త్‌ […]