Alert messages- దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌లో అలర్ట్‌

దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌లో అలర్ట్‌ మెసేజ్‌ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్‌ సౌండ్‌ రావడంతో​ కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే, టెస్టింగ్‌లో భాగంగానే ఇలా అలర్ట్‌ మెసేజ్‌ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది.  అయితే, దేశవ్యాప్తంగా గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్‌ఫోన్లకు వార్నింగ్‌ మెసేజ్‌ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్‌ సౌండ్‌ చేస్తూ స్క్రీన్‌పై మెసేజ్‌ డిస్‌ప్లే అయ్యింది. ఈ అలర్ట్‌పై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత […]

India – భారత్‌లో తొలి C-295 విమానం ల్యాండ్

భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన తొలి సి-295 రవాణా విమానం గుజరాత్‌ వడోదరలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ అయింది. బహ్రెయిన్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌ పీఎస్‌ నేగి దీన్ని నడుపుకొని వచ్చారు. దక్షిణ స్పెయిన్‌ నగరం సెవిల్లే నుంచి ఈ నెల 15న బయలుదేరిన ఈ విమానం ఈజిప్టు, మాల్టా, బెహ్రెయిన్‌లో ఆగి.. బుధవారం వడోదరలోని ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. ఈ నెల 13న భారత వైమానిక దళపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి ఎయిర్‌బస్‌ సంస్థ […]

Joe Biden- జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవానికి .

వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇటీవల దిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ఈ విషయమై బైడెన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారని మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి బుధవారం వెల్లడించారు. క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సు కూడా అదే సమయంలో భారత్‌లో జరుగుతుందా అని విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని […]

Canada has issued several instructions to its citizens living in India – భారత్‌లో నివసిస్తున్న తమ పౌరులకు పలు సూచనలు జారీ చేసిన కెనడా

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేయగా, బదులుగా భారత్‌ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. తాజాగా భారత్‌లో పర్యటిస్తున్న తమ పౌరులకు కెనడా పలు హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.  ‘‘భారత్‌లో ఉగ్రదాడుల […]

Old Parliament as Samvidhan Sadan – సంవిధాన్‌ సదన్‌గా పాత పార్లమెంటు

రాజ్యాంగ పరిషత్తు సమావేశాల నుంచి ఎన్నో ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం ఇకపై ‘సంవిధాన్‌ సదన్‌’గా మిగిలిపోనుంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అధికారిక ప్రకటన వెలువరించారు. (రాజ్యాంగాన్ని హిందీలో సంవిధాన్‌ అని అంటారు.) 1927లో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ భవనంలో ఎంతోమంది దిగ్గజ నేతల గళాలు ప్రతిధ్వనించాయి. మనల్ని మనం పాలించుకునే హక్కు కోసం పోరాడడం నుంచి స్వాతంత్య్రం సిద్ధించినరోజు వరకు ఎన్నో పరిణామాలను చూడడం ఒక ఎత్తయితే, 1947 తర్వాత […]

‘That credit is ours’ said Sonia Gandhi – ‘ఆ క్రెడిట్ మాదే’ అన్నారు సోనియా గాంధీ

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా  రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం […]

America has responded to the tensions between India and Canada – భారత్‌-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అగ్రదేశం అమెరికా స్పందించింది

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలపై అమెరికా స్పందించింది. ఆయన ప్రస్తావించిన అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్వేతసౌధ కౌన్సిల్‌ ప్రతినిధి అడ్రియెన్నె వాట్సన్‌ స్పందించారు. ‘కెనడా ప్రధాని ట్రూడో ప్రస్తావించిన ఆరోపణలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. కెనడా భాగస్వామ్య పక్షాలను […]

పార్లమెంట్‌ పాత భవనానికి వీడ్కోలు పలికిన ఎంపీలు – MPs bid farewell to the old Parliament building

స్వతంత్ర భారత్‌లో చోటుచేసుకున్న ఎన్నో కీలక ఘట్టాలకు పాత పార్లమెంట్‌ సాక్షిగా మిగలనుంది. మరికొన్ని గంటల్లో చట్టసభల కార్యకలాపాలు కొత్త భవనం(parliament new building)లోకి మారనున్నాయి. ఈ సమయంలో పాత భవనం జ్ఞాపకాలను పదిలపరుచుకునే ఉద్దేశంతో ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. వారంతా దీనికోసం మంగళవారం ఉదయం పాత పార్లమెంట్‌ ప్రాంగణానికి వచ్చారు. (Parliament Special Session) మొదట ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ఫొటోకు పోజు ఇచ్చారు. తర్వాత రాజ్యసభ […]

New Parliament Building – నూతన పార్లమెంటు భవనం

నూతన పార్లమెంటు భవనం (New Parliament Building)లో సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మంగళవారం నుంచి నూతన భవనంలోనే కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్‌ సభ్యులు తొలిసారి నూతన భవనంలో అడుగుపెట్టనున్నారు. ఈ విశిష్ట సందర్భానికి గుర్తుగా సభికులకు కేంద్రం ప్రత్యేక కానుక (Hamper)లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి, పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం అందివ్వనుంది. ఆ బ్యాగులపై […]

Diplomatic tensions between India and Canada have worsened over the Khalistani issue – ఖలిస్థానీ అంశంతో భారత్‌-కెనడా (India-Canada) మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి

ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్త (Indian diplomat)పై బహిష్కరణ వేటు  పడింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ అధిపతిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత విదేశాంగశాఖ […]