India – మత్స్యకారుల అరెస్టు

తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్న 27 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు శ్రీలంక నౌకాదళం ఆదివారం ప్రకటించింది. మన్నార్‌ తీరం సమీపంలో, డెల్ఫ్ట్‌, కచ్చదీవు ద్వీపాల సమీపంలో శనివారం మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మన్నార్‌ జల్లాల్లో వేట కొనసాగిస్తున్న రెండు ట్రాలర్లు, 15 మంది భారతీయ మత్స్యకారులను, డెల్ఫ్ట్‌, కచ్చదీవు ద్వీపాల సమీపంలో ఉన్న మూడు ట్రాలర్లు, 12 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది.

Trudeau – UAE అధ్యక్షుడు, జోర్డాన్‌ రాజుతో ‘భారత్‌’పై చర్చ..

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ దిల్లీతో కయ్యానికి కాలుదువ్విన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘‘చట్టాలను సమర్థించడం, గౌరవించడం’పై ఆయన సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉంది. అంతేగాక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయేద్‌, జోర్డాన్‌ రాజు అబ్దుల్లాతో  ‘భారత్‌-కెనడా దౌత్య వివాదం’ పై ట్రూడో చర్చించారు. ‘‘యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ […]

Vande Bharat : కాషాయ రంగులో

ఇటీవల కేరళలో ప్రారంభమైన వందేభారత్‌ (Vande Bharat) రైలుకు కాషాయ రంగు ఉండటం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ఆ రంగును ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ ఆలోచన ఉన్నట్టు చెప్పారు. ‘మనుషుల కళ్లకు రెండు వర్ణాలు బాగా కన్పిస్తాయి. ఒకటి పసుపు కాగా.. రెండోది ఆరెంజ్‌ రంగు. యూరప్‌లో దాదాపు 80 శాతం రైళ్లపై ఆరెంజ్‌ లేదా పసుపు, ఆరెంజ్‌ రంగులు కలగలిసి ఉంటాయి’ […]

24 people died in 24 hours – 24 గంటల్లో 24 మంది మృతి

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 24 గంటల్లో 24 మంది మరణించారు. వారిలో 12 మంది శిశువులు ఉన్నారు. మిగిలినవారు పెద్దవారు. ‘నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో 24 మంది చనిపోయారు. చనిపోయిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చిన వారున్నారు. మిగిలిన వారు పలు కారణాలతో మరణించారు’ అని మహారాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టరు దిలీప్‌ మైశేఖర్‌ సోమవారం వెల్లడించారు. ఈ విషాదంపై ముగ్గురు […]

Traffic in India! – భారతదేశంలో ట్రాఫిక్

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి ట్రాఫిక్‌ నెమ్మదిగా కదిలే నగరాల్లో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మన దేశంలోని భివంఢీ (5వ స్థానం), కోల్‌కతా (6వ స్థానం), ఆరా (7వ స్థానం) నగరాలు ఉన్నాయి. ఇక్కడ అతి నెమ్మదిగా ట్రాఫిక్‌ కదులుతుంటుంది. అమెరికాలోని ఎన్‌జీవో జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరో ఈ అధ్యయనం జరిపింది. 152 దేశాల్లోని 1200 నగరాల్లో ట్రాఫిక్‌ను పరిశీలించింది. రోజు మొత్తంలో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసింది. ఇందులో […]

There’s no improvement.. – ఎలాంటి మెరుగుదల లేదు..

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత ఏమీ మెరుగుపడలేదని దేశంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే సామాజిక మాధ్యమ వేదిక దేశవ్యాప్తంగా 341 జిల్లాల్లో ఈ సర్వేను చేపట్టింది. 39 వేలకుపైగా మంది అభిప్రాయాలను తెలుసుకుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం తమ నగరం/జిల్లాలో ప్రజా మరుగుదొడ్లు మెరుగయ్యాయని, లభ్యత పెరిగిందని 42% మంది పేర్కొన్నారు. అలాంటి మెరుగుదల […]

Flight Fares Got Increased – విమాన ఛార్జీలు పెరిగాయి

భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ ప్రణాళికల్లో మార్పులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం భారత్‌-కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతం మేర పెరిగాయని తెలిపాయి. గురువారం భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో దిల్లీ నుంచి […]

Canada has temporarily halted the issuance of visas to Indian citizens – కెనడా భారత పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది

భారత్‌ వ్యతిరేక శక్తులు, ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల కార్యకలాపాలకు నిలయంగా మారిన కెనడా పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సందేశాన్ని విస్పష్టం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. మన దేశంలో కెనడా దౌత్య కార్యాలయ సిబ్బందిని తగ్గించుకోవాలని సూచించింది. ఖలిస్థాన్‌ అనుకూల శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పునరుద్ఘాటిస్తూ ఈ విషయాలను ప్రకటించింది. కెనడాలో అధికమవుతున్న భారత్‌ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై […]

Another Khalistani- కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హతమయ్యాడు

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది. కెనడా (Canada)లో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే (Gangster Sukha Duneke) మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. కాగా.. ఈ హత్య తమ పనేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సామాజిక మాధ్యమాల్లో […]

Diplomatic tensions – ఖలిస్తాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్‌, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు ఈ వివాదానికి తెరలేపాయి. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిజ్జర్‌ హత్యపై కెనడా చేపట్టిన దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని అమెరికా సూచించింది. (India Canada diplomatic row) ‘‘నిజ్జర్ హత్యతో భారత్‌ ఏజెంట్లకు […]