Gang of fake drugs!

దేశరాజధాని ఢిల్లీలో నకిలీ మందులను తయారు చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.  నిందితులు రూ.1.96 లక్షల విలువైన క్యాన్సర్‌కు సంబంధించిన నకిలీ ఇంజెక్షన్లను విక్రయించారు. చైనా, అమెరికా తదితర దేశాలకు కూడా వీరు క్యాన్సర్‌  నకిలీ మందులను  పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన రూ.89 లక్షల […]

India-China news : అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు: చైనాకు భారత్‌ చురక

ప్రధాని మోదీ ‘అరుణాచల్‌’ పర్యటనపై నోరు పారేసుకున్న చైనాకు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ‘మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ’ డ్రాగన్‌కు చురకలంటించింది. దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో పర్యటించడంపై చైనా (China) తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నోరుపారేసుకున్నారు. ఈ విషయమై […]

Criticism of the opposition on the implementation of CAA / సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ […]

CAA act India / అమల్లోకి సీఏఏCAA act India /

వివాదాస్పద చట్టంపై కేంద్రం నిర్ణయం నియమ నిబంధనలతో నోటిఫికేషన్‌ జారీ లోక్‌సభ ఎన్నికల ముంగిట కీలక పరిణామం న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం–2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచి్చంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్‌సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది. సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి […]

ఉమెన్స్‌ డే కానుక: గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు

 మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ‍ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.  కాగా, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గిస్తున్నట్టు ట్విట్టర్‌ వేదికగా మోదీ తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా […]

ఏఐ కోసం రూ. వేలకోట్లు.. కేంద్రం కీలక నిర్ణయం

భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం నేడు (గురువారం) రూ. 10371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో జాతీయ-స్థాయి ‘ఇండియాఏఐ’ (indiaAI) మిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచం ఏఐలో దూసుకువెళ్తున్న సమయంలో మన దేశం కూడా ఈ రంగంలో తప్పకుండా ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు ప్రస్తావించారు. నేడు దీనికి […]

NIA: అతడి ఆచూకీ చెబితే ₹10లక్షల రివార్డు: ఎన్‌ఐఏ

బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఎన్‌ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.10లక్షల రివార్డును ప్రకటించింది. బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్‌ఐఏ (NIA) వేగవంతం చేసింది. ఇందులోభాగంగా బుధవారం కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు […]

Tesla – భారత్‌కు కార్లు.. వయా జర్మనీ

టెస్లా సంస్థ జర్మనీలోని తమ గిగాఫ్యాక్టరీ నుంచి భారత్‌కు విద్యుత్‌ కార్లను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. చైనాలోని షాంఘైలోనూ గిగాఫ్యాక్టరీ ఉన్నా, అక్కడ నుంచి విద్యుత్‌ కార్ల దిగుమతికి భారత అధికారులు ససేమిరా అనడంతో టెస్లా ఈ యోచన చేస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ ‘మనీకంట్రోల్‌’  పేర్కొంది. టెస్లాకు ఐరోపాలో తొలి ఫ్యాక్టరీ కూడా జర్మనీ గిగాఫ్యాక్టరీనే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన టెస్లా, 25,000 డాలర్ల (రూ.20 లక్షలపైన) కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని […]

KEADARNATH – రాహుల్‌ గాంధీ కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్‌లో మందిరం చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. ‘‘ఈ రోజు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ థామ్‌ను దర్శించి పూజ చేసుకున్నాను. హర్‌ హర్‌ మహాదేవ్‌’’ అని రాహుల్‌ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. సాయంత్రం హారతిలోనూ పాల్గొన్నారు. ‘ఛాయ్‌ సేవా’లో భాగంగా యాత్రికులకు టీ అందించారు. రాత్రికి రాహుల్‌ అక్కడే బస చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Canada : వీసా సేవల్ని పునరుద్ధరించనున్న భారత్‌..

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన ఉద్రిక్తతలతో కెనడా పౌరులకు ఇటీవల భారత్‌ వీసా సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో వీసా సేవల్ని పునరుద్ధరిస్తూ ఒట్టావాలోని భారత హైకమిషన్‌ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల్లో మాత్రమే ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్లు స్పష్టంచేసింది. భద్రతా పరిస్థితులపై సమీక్ష […]