Mahaganapati – మహాగణపతికి 2200 కిలోల లడ్డూ…

హైదరాబాద్: ఖైరతాబాద్‌ మహాగణపతికి బుధవారం లంగర్‌హౌస్‌కు చెందిన వ్యాపారవేత్త జనల్లి శ్రీకాంత్‌ 2200 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. 2016 నుంచి ప్రతి సంవత్సరం మహాగణపతికి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు. భారీ లడ్డూను తయారు చేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం భారీ ఊరేగింపు మధ్య క్రేన్‌ సాయంతో మహాగణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారని […]

power sector’s advancement-విద్యుత్ రంగం అభివృద్ధిలో

నాంపల్లి: రాష్ట్రంలో ప్రసార, పంపిణీ నెట్‌వర్క్‌ల అభివృద్ధికి రూ. 50,000 కోట్లు. దేశంలో ప్రతి కుగ్రామానికి శక్తినిచ్చే ఏకైక రాష్ట్రం మనది. ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు సమస్యలలో ఇంధన రంగం పరివర్తన అనే అంశంపై బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ఇంటరాక్టివ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు సామాజికంగా, విశాలంగా ఆలోచించాలని హాజరైన మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. గ్రీన్‌ ఎనర్జీకి బహిరంగ ప్రవేశం కల్పించేందుకు ప్రభుత్వం నిరాకరించిన హేతువులను అర్థం చేసుకోవాలి. బహిరంగ మార్కెట్ […]

State Minister KTR and TPCC president Revanth Reddy fought on Twitter – మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడుమ ట్విట్టర్‌ వేదికగా యుద్ధమే జరిగింది

హైదరాబాద్‌: విజయభేరి పేరుతో తుక్కు­గూడలో నిర్వహించిన భారీ బహిరంగసభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడుమ ట్విట్టర్‌ వేదికగా యుద్ధమే జరిగింది. మోసం, వంచన, ద్రోహం, దోఖాల మయం కాంగ్రెస్‌ అర్ధ శతాబ్దపు పాలనంతా అని  కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తే తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి అర్ధరాత్రి నుంచి అయ్యా కొడుకులు అంగీలు చింపుకుంటున్నారని రేవంత్‌ రీట్వీట్‌ చేశారు. మీ కపట […]

Minister KTR has expressed his anger on Twitter (X) – మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు….

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలు, ప్రత్యేకించి యువత అనేక త్యాగాలు చేసిన విషయాన్ని మరచి, పార్లమెంటు వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరాధార ప్రకటనలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక వాస్తవాలను పక్కన పెట్టి తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదన్నారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు సాగించిన రాజీ లేని పోరాటం […]

The Women’s Reservation Bill is historic – మహిళా రిజర్వేషన్‌ బిల్లు చరిత్రాత్మకం

హైదరాబాద్‌: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత […]

4 Lakh Devotees Visited Khairatabad Mahaganapati On The First Day – ఖైరతాబాద్‌ మహాగణపతిని తొలిరోజు దర్శించుకున్న 4 లక్షల మంది భక్తులు….

ఖైరతాబాద్‌: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతికి సోమవారం ఉదయం 11.15 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలిపూజ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ప్రాణప్రతిష్ట (కలశపూజ) నిర్వహించిన అనంతరం తమిళిసైతో పాటు హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ శాంతికుమారి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డిలు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో […]

Hussainsagar Is Another Beautiful Park – హుస్సేన్‌సాగర్‌ తీరంలో పార్కు

హైదరాబాద్: మహా నగరంలోనే ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరో అందమైన పార్కు రూపుదిద్దుకుంది. ఒకవైపు అమరుల స్మారకం, మరోవైపు శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణలో భాగంగా జలవిహార్‌ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.26.65 కోట్లతో హెచ్‌ఎండీఏ లేక్‌వ్యూ పార్కును అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో వెల్లడించారు. విశేషాలెన్నో..► […]

Women’s Reservation Bill In The Parliament – పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు

హైదరాబాద్: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంతో ఆమోదం పొందడం లాంఛనమేనన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో.. వీలైతే 2028 ఎన్నికలకు లేదా ఆ తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ.. వివిధ రంగాల్లోని మహిళలు.. ముఖ్యంగా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్లుగా ఉన్న వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్‌ ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లుండగా, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. అయినప్పటికీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి వారికి […]

Achieved Another World Record – మరో వరల్డ్‌ రికార్డును సాధించాడు…

హైదరాబాద్: అతి ఎత్తైన పర్వాతాలను అధిరోహిస్తూ ఇప్పటికే 3 వరల్డ్‌ రికార్డులు సొంతం చేసుకున్న నగరానికి చెందిన 14 ఏళ్ల పడకంటి విశ్వనాథ్‌ కార్తికేయ మరో వరల్డ్‌ రికార్డును సాధించాడు. ఈ నెల 17న లద్దాక్‌ సమీపంలో హిమాలయాల్లోని 6,400 మీటర్ల ఎత్తైన కాంగ్‌ యాట్సే–1 పర్వతాన్ని అధిరోహించి నాల్గో వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విశ్వనాథ్‌ కార్తికేయ గతంలోనే 6.270 మీటర్ల ఎత్తున్న కాంగ్‌ యాట్సే పర్వతాన్ని, 6,240 మీటర్ల ఎతైన […]

Drug Case – డ్రగ్స్ కేసులో కీలక మలుపు…

Hyderabad: మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉ‍న్న టాలీవుడ్ నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్‌చంద్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు […]