Telangana Cabinet Meeting today : నేడు మంత్రిమండలి సమావేశం

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. స్వయం సహాయక సంఘాల సదస్సు కూడాకీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండడంతో.. ఈ ఎన్నికలకు ముందు జరిగే క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మహిళలకు వడ్డీ లేని రుణ […]

Vande Bharat: వందేభారత్‌ @ 50.. సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో రైలు

Vande Bharat: దేశంలో మరో 10 వందేభారత్‌ రైళ్లకు ప్రధాని మోదీ నేడు పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందేభారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలుకు […]

Work from home మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్‌!

ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది.  నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్‌ చేస్తూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అభ్యర్థనలను హోరెత్తిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను పునఃప్రారంభించడానికి అనుమతించాలని వారు సీఎంను కోరుతున్నారు. కోవిడ్‌  మహమ్మారి సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని  ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి […]

Ganja and drugs were seized during SWOT police inspections ఎస్‌వోటీ పోలీసుల తనిఖీల్లో గంజాయి, డ్రగ్స్ పట్టివేత

Telangana: సైబరాబాద్‌లో ఎస్‌వోటీ చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం సైబరాబాద్‌లో ఎస్‌ఓటీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 4.4 కేజీల గంజాయి, ఎల్‌ఎస్‌డీ పేపర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేసి డ్రగ్స్, గంజాయిని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లో ఎస్‌వోటీ (SOT) చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం సైబరాబాద్‌లో ఎస్‌ఓటీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు […]

850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్‌!

ఆ 850 ఎకరాల భూమి రద్దు సరైనదే.. చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పు పట్టిన తెలంగాణ హైకోర్టు వైఎస్సార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు భూముల రద్దును సవాల్ చేస్తూ బిల్లీ రావు వేసిన పిటిషన్‌ కొట్టివేస్తూ తీర్పు హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సం‍స్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. […]

MLC Kavitha: దిల్లీ లిక్కర్‌ కేసులో నేనూ బాధితురాలినే: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ కేసును టీవీ సీరియల్‌ మాదిరిగా సాగదీస్తున్నారని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు హైదరాబాద్: దిల్లీ లిక్కర్‌ కేసును టీవీ సీరియల్‌ మాదిరిగా సాగదీస్తున్నారని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆ కేసులో తానూ బాధితురాలినేనని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని.. ఆదర్శ్‌ స్కామ్‌లో ప్రమేయం ఉన్న అశోక్‌ చవాన్‌కు రాజ్యసభ […]

TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ సర్వీసుల్లో 10% డిస్కౌంట్‌

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ […]

Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతల ధర్నా.. 

హైదరాబాద్‌: తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. LRS పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.  ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు.. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్‌లోని […]

Hyderabad – చిక్కిన మరో గ్రహ శకలం గుర్తించిన సిద్ధిక్ష .

అబ్దుల్లాపూర్‌మెట్‌:యువ ఖగోళ శాస్త్రం-ఆసక్తి ఉన్న అమ్మాయి గ్రహ ముక్కల ఉనికిని గమనిస్తోంది. ఆమె తన అక్కతో కలిసి “2021 GC 103” గ్రహ శిధిలాలను కనుగొన్నందుకు గతంలో NASA నుండి సర్టిఫికేట్ పొందింది. ఇది ఖగోళ అన్వేషణ తన లక్ష్యాన్ని ప్రకటించింది మరియు ఇటీవల ఒక గ్రహం యొక్క మరొక భాగం యొక్క సాక్ష్యాన్ని కనుగొంది. వనస్థలిపురం నరసింహారావు నగర్‌లో ఏడో తరగతి చదువుతున్న ఈమె పదకొండేళ్ల వయసులోనే ఇదంతా సాధించడం ఆశ్చర్యంగా ఉంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం […]

Hyderabad – మైనర్ల సహకారంతో హెరాయిన్‌ విక్రయిస్తున్న హైటెక్‌ ముఠా

ఎల్‌బీనగర్‌;బైక్‌ ట్యాక్సీల ద్వారా హెరాయిన్‌ విక్రయిస్తున్న హైటెక్‌ ముఠాను చిన్నారుల సహకారంతో ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. నగరంలో రాజస్థాన్‌ నుంచి వస్తువులు విక్రయిస్తున్న ఈ ముఠాలోని ఇద్దరు ప్రధాన నిందితులకు సహకరిస్తున్న ఇద్దరు చిన్నారులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నాలుగు ఫోన్లు, ద్విచక్ర వాహనం, 80 గ్రాముల హెరాయిన్‌ రూ. 50 లక్షలు. ఎల్‌బీనగర్‌, మహేశ్వరం ఎస్‌ఓటీ సోమవారం రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, డీసీపీ మురళీధర్‌, ఏసీపీ మట్టయ్య, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ […]