Khairatabad Constituency- శ్రీ దానం నాగేందర్‌కు BRS టికెట్

రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్(Khairatabad) నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ దానం నాగేందర్‌ను(Sri Danam Nagender) బరిలోకి దించనున్నట్లు భారతీయ రాష్ట్ర సమితి (BRS) ప్రకటించింది. అతను మల్కాజిగిరి నియోజకవర్గం నుండి ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు (MP) కూడా. తన నామినేషన్‌పై నాగేందర్ స్పందిస్తూ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు మరియు ఖైరతాబాద్ ప్రజలకు సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, నాణ్యమైన వైద్యం మరియు విద్యను పొందడం […]

Another person died in the gas leakage incident – గ్యాస్‌ లీకేజీ ఘటనలో మరొకరు మృతి

ఫిలింనగర్‌: ఫిలింనగర్‌లోని మహాత్మగాంధీనగర్‌ వడ్డెర బస్తీలో సోమవారం తెల్లవారుజామున గ్యాస్‌ లీకేజీ ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మంగళవారం మరొకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి..మహాత్మగాంధీనగర్‌ వడ్డెర బస్తీలో నివాసం ఉంటున్న రమేష్‌ చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తు న్నాడు. ఆదివారం రమేష్‌(38), అతడి భార్య శ్రీలత(32), కుమారుడు హర్షవర్ధన్‌(13), కూతు రు సీతామహాలక్ష్మి(8) ఇంట్లో నిద్రపోయారు. సోమవారం ఉదయం రమేష్‌ నిద్ర లేచి లైట్‌ వేయగా అప్పటికే గ్యాస్‌ […]

Permission for construction of Congress building – కాంగ్రెస్‌ భవన నిర్మాణానికి అనుమతి

హైదరాబాద్: ఎట్టకేలకు కాంగ్రెస్‌ భవన నిర్మాణానికి కంటోన్మెంట్‌ బోర్డు అనుమతులు ఇచ్చింది. దాదాపు ఏడాదిగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై గత మే నెలలోనే బోర్డు తీర్మానం ఆమోదించగా, అందుకు సంబంధించిన పత్రాలను మంగళవారం జారీ చేసింది. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి బోర్డు కార్యాలయానికి వచ్చి పత్రాలను అందుకున్నారు. దీంతో 15 ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఫలించిన రేవంత్‌ […]

Township in the East! – మహానగరానికి తూర్పు వైపున మరో భారీ లే అవుట్‌కు హెచ్‌ఎండీఏ కసరత్తు చేపట్టింది..

హైదరాబాద్: హైదరాబాద్‌ మహానగరానికి తూర్పు వైపున మరో భారీ లే అవుట్‌కు హెచ్‌ఎండీఏ కసరత్తు చేపట్టింది. అన్ని వైపులా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఇటీవల కోకాపేట్‌, మోకిలా, బుద్వేల్‌, తదితర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ సొంత స్థలాల్లో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. గతంలో ఉప్పల్‌ భగాయత్‌లోనూ కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. ఇక్కడ మూడు దఫాలుగా బిడ్డింగ్‌ నిర్వహించి ప్లాట్‌లను విక్రయించారు. తాజాగా ఉప్పల్‌ భగాయత్‌ తరహాలోనే ప్రతాప సింగారంలో భారీ లే అవుట్‌ను […]

Plaster of Paris (POP) idols should not be immersed – హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీఓపీ) విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయకూడదు.

ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోమని గతంలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) అధికారులు మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉన్నారు. మహానగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో 5 అడుగుల నుంచి 60 అడుగుల వరకు లక్ష గణేశ్‌ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవికాకుండా అడుగు […]

Alert for Telangana Heavy rains for five days – తెలంగాణకు అలర్ట్‌.. ఐదు రోజులు భారీ వర్షాలే..

హైదరాబాద్‌: గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వచ్చే ఐదురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  వాతావరణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నుంచి కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నేటిం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో […]

Preeti’s case on the screen once again – మరోసారి తెరపైకి ప్రీతి కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..

హైదరాబాద్‌: వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతి కేసులో సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ విద్యార్థి ఎంఏ సైఫ్‌ అలీ వాదన వినాలని కాకతీయ మె డికల్‌ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అతనిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ధరావత్‌ ప్రీతి ఎండీ అనస్థీషియా విద్యార్ధినిగా 2022లో చేరింది. రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్‌ ఆమెను ర్యాగింగ్‌ చేస్తూ వేధింపులకు గురిచేశారు.  ఈ నేపథ్యంలో ఫిబ్రవరి […]

One day in RTC September 11 – ఆర్టీసీలో అనగనగా ఓ రోజు.. సెప్టెంబర్‌ 11

హైదరాబాద్‌: ఆర్టీసీ అనగానే.. నష్టాలు, అప్పులు, ఆలస్యంగా తిరిగే ట్రిప్పులు, డొక్కు బస్సులు.. ఇలాంటివి చాలామందికి మదిలో మెదులుతాయి. కానీ, కొంతకాలంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న సంస్థ తనను తాను మార్చుకుంటూ వస్తూ ఇప్పుడు అరుదైన రికార్డు సృష్టించింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో కేవలం నాలుగు డిపోలు మాత్రమే ఖర్చులను మించి ఆదాయాన్ని సాధించాయన్న విషయం అధికారులు ఆయన ముందుంచారు. తాజాగా ఆర్టీసీ చేసిన ఫీట్‌ ఏంటంటే.. ఆర్టీసీలో 96 డిపోలు ఉండగా, గత […]

Pour alcohol… and smoke cigarettes – మద్యం పోసి… సిగరెట్లు తాగించి

 హైదరాబాద్‌: గాంధీ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేయడంతో వైద్య విద్యార్థి లోకం ఉలిక్కిపడింది. ర్యాగింగ్‌ పేరిట కొందరు సీనియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఇటీవల జూనియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్‌ రూములకు రప్పించి వారికి బలవంతంగా మద్యం పోసి… సిగరెట్‌లు తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ […]