People Trapped In Floods Due To Cyclone Remal In Northeastern States : వణుకుతున్న ఈశాన్యం.. స్థంభించిన జనజీవనం..

భారీ వరదలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ తల్లడిల్లుతోంది. రాజధాని ఇంఫాల్‌లో జనజీవితం స్తంభించింది. నదులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించింది. రెమాల్‌ తుఫాన్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఈశాన్య రాష్ట్రాలు తేరుకోవడం లేదు. తుఫాన్‌ కారణంగా మణిపూర్‌,అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదలతో తల్లడిల్లుతున్నారు జనం . మణిపూర్‌లో అయితే పరిస్థితి ఔట్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అయ్యింది. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఇప్పటికి కూడా జనం రిలీఫ్‌ క్యాంప్‌ల్లోనే ఆశ్రయం తీసుకుంటున్నారు. […]

Cyclone: Cyclone destruction in Bengal.. బెంగాల్‌లో తుఫాన్ విధ్వంసం.. పలు ఇళ్లు ధ్వంసం, నేలకూలిన చెట్లు.. 5 మంది మృతి

తుఫాను కారణంగా సంభవించిన మరణాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తుపాను ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. ఈ ప్రాంతంలో తుఫాను, వర్షం,  వడగళ్ల వాన కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయి. చాలా ఇళ్లు […]