London Heathrow Airport: యూకేలోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి లాక్కెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్ వద్ద బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకింది. ఈ ఘటనలో రెండూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ధ్రువీకరించాయి. ‘‘మా ఎయిర్‌క్రాఫ్ట్ ఎంత మేరకు దెబ్బతిన్నదో […]