Samantha Health Podcast: ఏడాదిన్నరగా పోరాడుతున్నానంటే నమ్మలేకపోతున్నా: సమంత

ఆటో ఇమ్యూనిటీతో ఏడాదిన్నరగా బాధ పడుతున్నట్లు సమంత తెలిపారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: సిటడెల్‌ కోసం ఎంతో కష్టపడినట్లు సమంత (Samantha Ruth Prabhu) చెప్పారు. ఒకవైపు మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూనే అప్పటివరకు అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితుల గురించి తాజాగా హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ సిరీస్‌లో(Health Podcast) వివరించారు. ‘మై జర్నీ విత్ ఆటోఇమ్యూనిటీ’(Autoimmunity) పేరుతో ఇది యూట్యూబ్‌లో విడుదలైంది. అందులో న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానమిచ్చారు. ఆటోఇమ్యూనిటీని […]