Hardik Pandya – స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా..

గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు. హార్దిక్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడించే అవకాశాల్ని జట్టు మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది. చీలమండ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న హార్దిక్‌ వేగంగా కోలుకుంటున్నాడు.  ఈనెల 29న లఖ్‌నవూలో ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడుతుంది. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే సూర్యకుమార్‌ స్థానంలో […]