Hamburg – విమానాశ్రయంలో వీడిన ఉత్కంఠ
జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 18 గంటల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ దుండగుడు కారు సాయంతో విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు […]