Israel-Hamas: ‘గాజాపై వైమానిక దాడులు ఆపితే.. బందీల విడుదల’..

ఇజ్రాయెల్‌ (Israel)పై మెరుపుదాడి చేసి కొందరు పౌరులను బందీలు (hostages)గా పట్టుకెళ్లిన హమాస్‌ (Hamas) గ్రూప్‌.. ఇప్పుడు వారిని విడిచిపెట్టేందుకు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఇజ్రాయెల్‌కు షరతు విధించినట్లు సమాచారం. గాజాలో బాంబు దాడులు ఆపితే బందీలందరినీ విడిచిపెట్టేస్తామని హమాస్‌ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పినట్లు ‘ఎన్‌బీసీ న్యూస్‌’ కథనం వెల్లడించింది. ‘గాజాలో ఇజ్రాయెల్‌ బలగాలు తమ సైనిక దురాక్రమణ, వైమానిక దాడులను నిలిపివేస్తే.. గంటలోనే మా వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌, ఇతర […]

Israel-Hamas : గాజా ఆసుపత్రిపై దాడి

ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో విలవిల్లాడుతున్న గాజా (Gaza)లో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకొంది. అల్‌ అహ్లి ఆసుపత్రి (Attack on Hospital)లో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో పశ్చిమాసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాగా.. ఈ దారుణానికి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులే కారణమని హమాస్‌ (Hamas) ఆరోపించగా.. దాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ఖండించారు. అది ఉగ్రమూకల దుశ్చర్యే అని దుయ్యబట్టారు. ఐడీఎఫ్‌ కాదు: నెతన్యాహు ‘‘ఈ […]

War – హమాస్‌, ఇజ్రాయెల్‌ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా

హమాస్‌, ఇజ్రాయెల్‌ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో ముప్పేట దాడి ముప్పు ముంచుకొస్తోంది. ఇటు గాజా నుంచి హమాస్‌ రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది. అటు ఇజ్రాయెల్‌ వైమానిక దాడులను చేస్తూనే ఉంది. గాజా సరిహద్దుల్లో బలగాలను మోహరించి యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇటు లెబనాన్‌వైపూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెల్‌ ఏర్పాటుచేసిన నిఘా కెమెరాలను హెజ్‌బొల్లా ధ్వంసం చేస్తోంది. ఒకవేళ గాజాలో భూతల దాడులకు దిగితే తామూ యుద్ధంలోకి వస్తామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. మరోవైపు గాజాలో ప్రజల […]

Hamas Attack – ఇద్దరు భారత భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల్లో భారత సంతతికి చెందిన కనీసం ఇద్దరు భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరినీ లెఫ్టినెంట్‌ ఓర్‌ మోజెస్‌ (22), పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కిమ్‌ డొక్రాకెర్‌లుగా  గుర్తించారు. విధి నిర్వహణలో వీరిద్దరూ ప్రాణత్యాగం చేసినట్లు బయటపడింది. ఇంతవరకు 286 మంది సైనికులు, 51 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తేల్చారు. మృతులను, అపహరణకు గురైనవారిని గుర్తించే పని కొనసాగుతున్నందువల్ల ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.

Hollywood : ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల్ని ఖండించింది

ఇజ్రాయెల్‌ (Israel) పై హమాస్‌ (Hamas) దాడుల్ని హాలీవుడ్‌ (Hollywood) ఖండించింది. ఉగ్రవాదులు చేసింది ఒక పాశవిక చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని పలువురు సినీ తారలు పిలుపునిచ్చారు. ఈ మేరకు క్రియేటివ్‌ కమ్యూనిటీ ఫర్‌ పీస్‌ సంస్థ రాసిన లేఖపై 700కుపైగా సినీ తారలు సంతకాలు చేశారు. ‘‘హమాస్‌కు చెందిన వ్యక్తులు అమాయక ప్రజల్ని హత్య చేశారు. చిన్న పిల్లల్ని, పెద్దల్ని అపహరించి దారుణంగా చంపేశారు. ఇది ఉగ్రవాదం.. రాక్షసత్వం. […]

Israel – శత్రువుకు శత్రువు మిత్రుడు..

ఈ సూత్రం ఆధారంగానే హమాస్‌కు చేయూతనిచ్చింది ఇజ్రాయెల్‌. పాలస్తీనా ఏర్పాటు లక్ష్యంగా 1950ల చివర్లో ఏర్పడ్డ ఫతా అనే సంస్థ ఇజ్రాయెల్‌పై సాయుధ దాడులకు సిద్ధమైంది. దీని అధిపతి యాసర్‌ అరాఫత్‌. తర్వాతి కాలంలో ఆయన సారథ్యంలోనే అనేక అరబ్‌ గ్రూపులు కలిసి పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌గా (పీఎల్‌వో) ఏర్పడ్డాయి. ఇది మత ఛాందస సంస్థ కాదు. లౌకిక జాతీయవాద, వామపక్ష సంస్థ. 1969లో పీఎల్‌వో ఛైర్మన్‌ అయిన అరాఫత్‌ 2014లో చనిపోయేదాకా ఆ పదవిలో ఉన్నారు. […]

  • 1
  • 2