‘Ujjwala’ beneficiaries – ఓ గ్యాస్‌ సిలిండర్‌ ఉచితం

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో ‘ఉజ్వల యోజన’ పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారందరికీ దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని మంగళవారం ప్రకటించారు. బులంద్‌శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఈ మేరకు వెల్లడించారు.