Mahaganapati – మహాగణపతికి 2200 కిలోల లడ్డూ…

హైదరాబాద్: ఖైరతాబాద్‌ మహాగణపతికి బుధవారం లంగర్‌హౌస్‌కు చెందిన వ్యాపారవేత్త జనల్లి శ్రీకాంత్‌ 2200 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. 2016 నుంచి ప్రతి సంవత్సరం మహాగణపతికి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు. భారీ లడ్డూను తయారు చేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం భారీ ఊరేగింపు మధ్య క్రేన్‌ సాయంతో మహాగణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారని […]

Ganapati Bappa Morea.. – గణపతి బప్పా మోరియా..

దేశమంతటా గణేశ్‌ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో వెలసిన ప్రఖ్యాత దగడూసేఠ్‌ గణేశుని మండపంలో సంబరాలు ఘనంగా జరిగాయి. చవితిరోజు నుంచే ఘనంగా వేడుకలు జరగ్గా.. బుధవారం ఉదయం దాదాపు 36,000 మంది మహిళలు సామూహిక భజనలు చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగింది. రుషి పంచమిలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న భక్తులు గణేశుని ముందు ‘అథర్వశీర్ష’ పారాయణం చేశారు. కొంతమంది రష్యన్లు, థాయిలాండ్‌ […]

4 Lakh Devotees Visited Khairatabad Mahaganapati On The First Day – ఖైరతాబాద్‌ మహాగణపతిని తొలిరోజు దర్శించుకున్న 4 లక్షల మంది భక్తులు….

ఖైరతాబాద్‌: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతికి సోమవారం ఉదయం 11.15 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలిపూజ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ప్రాణప్రతిష్ట (కలశపూజ) నిర్వహించిన అనంతరం తమిళిసైతో పాటు హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ శాంతికుమారి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డిలు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో […]

ganasadhuniki-మస్తు డిమాండ్‌

GANESH IDOLS : గణేష్ నవరాత్రి ఉత్సవాలు త్వరలో రానున్నందున ప్రజలు విపరీతంగా వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కరోనా వైరస్ కారణంగా పెద్దగా విగ్రహాలు పెట్టడం లేదు. అయితే ఈ ఏడాది మాత్రం నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు సిద్ధమయ్యాయి. ఉత్సవాల ఇన్ చార్జిలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రచారంలో భాగంగా పలు విగ్రహాలను అందజేస్తున్నారు. గతేడాది కంటే రెట్టింపు అమ్మకాలు జరిగాయని విగ్రహాలను తయారు చేసే వారు చెబుతున్నారు. అయితే  మట్టి […]

Ganesh Chaturthi – గణేష్ చతుర్థి

Ganesh Chathurthi: భారతదేశం అంతటా గణేష్ చతుర్థిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నప్పటికీ, తెలంగాణలో(Telangana Festival)  గణేష్ చతుర్థికి ప్రత్యేకమైన శోభ ఉంది. ఈ పండుగ వినాయకుడి జన్మదినాన్ని సూచిస్తుంది మరియు భక్తులు వివిధ ఆకులు మరియు పువ్వులతో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా  మూడు, ఐదవ లేదా తొమ్మిదవ రోజున విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. గణేశుడికి ఇష్టమైనవిగా భావించే ఉండ్రాళ్లు, మోదక వంటి అనేక వంటకాలు తయారుచేస్తారు. ప్రధాన ఆకర్షణ: వినాయకుని పెద్ద విగ్రహాలు, […]