Game Changer – పాన్ ఇండియా చిత్రం.
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిమంది కళాకారులు అందుబాటులో లేనందున ఈ సెప్టెంబరు షెడ్యూల్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. అక్టోబరు రెండో వారంలో మళ్లీ చిత్రీకరణ ప్రారంభమవుతుందని ప్రకటించింది. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న […]