Air India Flight Delayed 24 Hours : 24 గంటలపాటు ఆలస్యం.. విమానంలో స్పృహ తప్పిన ప్రయాణికులు…..

Air India flight Delay:ఎయిరిండియాకు చెందిన ఓ విమానం 24 గంటల పాటు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి అందులోనే కూర్చోవడంతో కొందరు స్పృహతప్పి పడిపోయారు. దిల్లీ: మండు వేసవిలో ఎయిరిండియా ప్రయాణికులు అవస్థలు పడ్డారు. విమానం ఆలస్యం (Flight Delay) కారణంగా గంటల తరబడి అందులోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏసీ కూడా వేయకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురయ్యారు. కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం […]

Suicide by jumping into the engine of the plane..?  ప్రమాదవశాత్తు అతడు అందులో పడ్డాడా.. ఓ రకంగా ఆత్మహత్య చేసుకొన్నాడా..?

ఆమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌ పోర్టులో ఓ వ్యక్తిని విమానం ఇంజిన్‌ లోపలికి లాగేసుకొంది.  ఇంటర్నెట్‌డెస్క్‌: అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ (Amsterdam airport) విమానాశ్రయంలో చోటు చేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్‌ 1341 విమానం పుష్‌బ్యాక్‌ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్‌ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎయిర్‌ పోర్టు సిబ్బందా.. లేకా బయట వ్యక్తా? […]

Man Tries To Open IndiGo Flight Door Mid Air : విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే యత్నం..

ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు తెలిసాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ప్రయాణికుడు అనిల్‌ పాటిల్‌ మే 21న ఇండిగో విమానంలో ఇండోర్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరాడు. మార్గమధ్యంలో అతను కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు తెలిసాయి. స్నేహితులతో […]

Spicejet Flight Hit By Bird Returns To Delhi And Passengers Deplaned: విమానం ఇంజిన్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..!

మే 26, 2024న ఢిల్లీ నుండి లేహ్‌కు SG-123ని నడుపుతున్న స్పైస్‌జెట్ B737 విమానం ఇంజిన్ 2కి పక్షి ఢీకొనడంతో తిరిగి ఢిల్లీకి తిరిగి వచ్చిందని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. స్పైస్‌జెట్ విమానాలు ఇంజిన్ వైబ్రేషన్‌లను అనుసరించి ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తాయి విమానం ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఆ విమానంలోని ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లో దింపివేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో […]

BarkAir: బార్క్ ఎయిర్‌.. ఈ విమానం కేవలం శునకాలకే

BarkAir: శునకాల కోసం బార్క్‌ఎయిర్‌ అనే సంస్థ ప్రత్యేక విమానయాన సేవలను ప్రారంభించింది. దీంట్లో వాటికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. ధర మాత్రం కాస్త ఎక్కువే. ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. arkAir | ఇంటర్నెట్‌ డెస్క్‌: పెంపుడు శునకాలతో విమాన ప్రయాణమంటే పెద్ద సవాలే. అవి ఎక్కడ భయపడిపోతాయోననే ఆందోళన. పైగా విమానయాన సంస్థల ఆంక్షలు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ‘బార్క్‌ ఎయిర్‌’ (BarkAir) అనే సంస్థ సిద్ధమైంది. ప్రత్యేకంగా పెంపుడు శునకాల […]

America : Big accident missed by Boeing-737..బోయింగ్ కు తప్పిన పెను ప్రమాదం..

అమెరికా ( America ) లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ జెట్ బోయింగ్-737 కు పెను ప్రమాదం తప్పింది. సదరు విమానయాన సంస్థకు వారం రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. హ్యూస్టన్ కు వెళ్తున్న బోయింగ్ విమానం ఇంజిన్ కవర్ విడిపోయి వింగ్ ఫ్లాప్‌ను తాకింది. అమెరికా ( America ) లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ జెట్ బోయింగ్-737 కు పెను ప్రమాదం తప్పింది. సదరు విమానయాన సంస్థకు వారం రోజుల్లో ఇది రెండో ప్రమాదం […]

Two flights Accident : ఢీకొట్టిన రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం..

కోల్‌కతాలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొట్టిన సంఘటన బుధవారం కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ రెండు విమాణాలు ఎలా ఢీకొట్టాయి.? అసలు ప్రమాదం ఎలా తప్పిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. కోల్‌కతా విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమానాలు […]

Helicopter for rent, chartered flight..!ఎన్నికల వేళ.. అద్దెకు హెలికాప్టర్, చార్టర్డ్ ఫ్లైట్..! గంటకు అద్దె ఎంతో తెలుసా..?

ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చు చేసే రాజకీయ పార్టీలు,.. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు అద్దెకు హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు అందుబాటులోకి రావడంతో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే విస్తృత ప్రచారం మొదలుపెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకు.. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ట్రెండ్ మార్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ […]

Attempt to open emergency door before landing.. – ల్యాండింగ్‌కు ముందే ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం..

విమానంలో కొందరు ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. తాజాగా ఇండిగో విమానం ( IndiGo flight)లో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన దిల్లీ (Delhi) నుంచి చెన్నై (Chennai)కు బయలుదేరిన విమానంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం  6E 6341 మంగళవారం రాత్రి దిల్లీ నుంచి […]