India – మత్స్యకారుల అరెస్టు

తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్న 27 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు శ్రీలంక నౌకాదళం ఆదివారం ప్రకటించింది. మన్నార్‌ తీరం సమీపంలో, డెల్ఫ్ట్‌, కచ్చదీవు ద్వీపాల సమీపంలో శనివారం మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మన్నార్‌ జల్లాల్లో వేట కొనసాగిస్తున్న రెండు ట్రాలర్లు, 15 మంది భారతీయ మత్స్యకారులను, డెల్ఫ్ట్‌, కచ్చదీవు ద్వీపాల సమీపంలో ఉన్న మూడు ట్రాలర్లు, 12 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది.