Rajkot Fire Accident: 12 మంది చిన్నారులు సహా 30 మంది సజీవదహనం.. రాజ్‌కోట్ ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..!

ఇంతటి విషాదానికి కారణం ఏంటి ?.. ఇది ప్రమాదమేనా ?.. ఎవరి నిర్లక్ష్యం ఖరీదు ఈ నిండు ప్రాణాలు. ఈ హత్యకు బాధ్యులెవరు ?.. ముక్కుపచ్చలారని చిన్నారులను బలితీసుకుంది ఎవరు ? ఏ పాపం తెలియని అమాయకులను పొట్టనపెట్టుకుంది ఎవరు ? నిబంధనలు పాటించి ఉంటే.. భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే.. ఇలాంటి ప్రమాదం జరిగేదా ?.. ఒకవేళ జరిగినా.. ప్రాణనష్టం ఈ స్థాయిలో ఉండేదా ? ఉల్లాసంగా అక్కడికి వచ్చారు. ఎంతో సరదాగా గడుపుదామని అనుకున్నారు. కానీ […]

Delhi Child Care Hospital Fire child Missing : ఆసుపత్రి అగ్నిప్రమాదంలో శిశివు మిస్సింగ్.. 

ఒక కుటుంబం తమ చిన్నారి పాప ఆచూకీ కోసం వెదుకుతుంది. పోలీసు స్టేషన్, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ తమ బిడ్డ ఆచూకీ కోసం వెదుకుతున్నారు. అయితే వీరి పాప ఎక్కడ ఉంది? అసలు బతికి ఉన్నాదా లేక మరణించిందా అనే సమాచారం ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. మరోవైపు వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ నిందితులు నవీన్ చిచ్చి, డాక్టర్ అశోక్‌లను అరెస్టు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని వివేక్ విహార్ […]

Gurugram-Jaipur Express – స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

గురుగ్రామ్‌-జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్‌ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో అవి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 12 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఝార్సా ఫ్లై ఓవర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Maharastra – రైలు ప్రమాదం..

మహారాష్ట్రలో ఓ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం మధ్యాహ్నం అహ్మద్‌నగర్‌ నారాయణ్‌పుర్‌ స్టేషన్ల మధ్య 8 బోగీల డెము రైల్లో  భారీగా మంటలు చేలరేగాయి. ఐదు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం సంభవించలేదని, గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంటలు వ్యాపించగానే రైలులో ఉన్నవారిని కిందకు దించినట్లు చెప్పారు.

Fire Accident – ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

ముంబయిలో గోర్‌గోన్‌ ప్రాంతంలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 30మందికిపైగా గాయపడ్డారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.