JUBLIEHILLS – కుమార్తె కళ్లెదుటే తండ్రి ఆత్మహత్య
కన్నబిడ్డకు పెళ్లి చేయడానికి అవసరమైన డబ్బు లేదన్న బాధతో ఆమె ఎదుటే తండ్రి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. హైదరాబాద్ హుస్సేనీ అలంలో నివాసం ఉంటున్న ఏఆర్‌ఎస్సై ఫాజిల్ అలీ(59) ఏడాదికాలంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద గన్‌మేన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. వారికి విడాకులు కావడంతో పుట్టింట్లోనే ఉంటున్నారు. కుమారుడు సంతోష్‌నగర్‌లో చిరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. మూడో కుమార్తె ఆసియా ఫాతిమాకు పెళ్లి చేయాలని భావించారు. […]