Fancy numbers.. – ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్..
గ్రేటర్‌లో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలలో వీటికి అధిక డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే రూ.53 కోట్ల ఆదాయం వచ్చింది. రంగారెడ్డి, హైదరాబాద్‌లలో రూ.38.48 కోట్ల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా 9999, 0001, 0007, 0009కు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఇటీవల ఖైరతాబాద్‌లో పరిధిలో 0009 నంబరును రూ.10.5 లక్షలకు ఆన్‌లైన్ వేలంలో దక్కించుకోగా మలక్‌పేట ఆర్టీఏ పరిధిలో 9999 నంబరుకు రూ.21.6 లక్షలు పెట్టి కైవసం చేసుకోవడం విశేషం.