Siddarth Jonnalagadda – సిద్ధార్థ్ జొన్నలగడ్డ
సిద్ధు జొన్నలగడ్డ ఒక సినీ నటుడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో కథానాయకుడయ్యాడు. అంతకు మునుపు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. సిద్ధు హైదరాబాదులో పుట్టి పెరిగాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తూనే ఎంబీయే పూర్తి చేశాడు. తల్లి 25 సంవత్సరాలు ఆలిండియా రేడియోలో పనిచేసింది. తల్లితో కలిసి సంగీత కార్యక్రమాలకు వెళ్ళడం వలన సంగీతం మీద ఆసక్తి కలిగింది. నాలుగేళ్ళపాటు తబలా నేర్చుకున్నాడు. ప్రభుదేవా స్ఫూర్తితో ఐదేళ్ళ పాటు నృత్యంలో శిక్షణ తీసుకున్నాడు. నటించిన […]