Chiranjeevi: చిరంజీవికి గోల్డెన్‌ వీసా.. నెట్టింట శుభాకాంక్షల వెల్లువ

అగ్ర కథానాయకుడు చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి గోల్డెన్‌ వీసా అందుకున్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలే పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసా ( UAE Golden Visa)ను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మెగాస్టార్ చేరారు. దీంతో […]

Heavy Rain In Dubai : దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి.

అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యూఏఈలో తీవ్రస్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం. అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. తాజాగా, దుబాయ్ లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి. అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే […]

Allu Arjun Wax Statue Launch:  దుబాయ్‌లో అల్లు అర్జున్‌.. ఆ గౌరవం దక్కించుకున్న తొలి హీరోగా గుర్తింపు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్‍లో అడుగుపెట్టారు. తన కుటుంబంతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. దుబాయ్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‍లో  పాపులర్ అయిన బన్నీ నేషనల్‌ అవార్డు అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం […]

HOLI DUABI : Holi celebrations at Srikrishna Temple in Dubai ! దుబాయ్‌ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య  పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీకి […]