United States of America (USA) – టర్కీకి చెందిన డ్రోన్‌ను కూల్చివేసింది
పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో(NATO) సభ్యదేశం తుర్కియే(Turkey)కు చెందిన డ్రోన్‌ను అమెరికా(USA) కూల్చివేసింది. సిరియా(Syria)లో మోహరించిన అమెరికా బలగాలు.. తమ క్యాంప్ వైపునకు డ్రోన్ రావడంతో ముప్పుగా భావించి యూఎస్ ఫైటర్ జెట్లతో కూల్చివేశాయి. ఈ విషయాన్ని పెంటగాన్ వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం అంకారాలోని తుర్కియే పార్లమెంట్ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు తామే బాధ్యులమని కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ ప్రకటించింది. […]