మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా?

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం జరిగింది. మరి కొన్ని గంటల్లో పెళ్లి ఉంది అనగా.. వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత కిరాతకంగా 15సార్లు పొడిచి మరి ప్రాణాలు తీశారు అగంతకులు. ఈ ఘటన సౌత్‌ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. 29 ఏళ్ల గౌరవ్‌ సింఘాల్‌ జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఇతడికి గురువారమే పెళ్లి జరగనుంది.  ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా మరికొన్ని గంటల్లో వధువు మెడలో తాళి కడతాడనే సమయంలో తన […]

Air Pollution – కాలుష్యంపై పోరు.. ‘కృత్రిమ వర్షానికి’ సిద్ధమవుతోన్న దిల్లీ!

రోజురోజుకు పెరిగిపోతోన్న కాలుష్యంతో (Air Pollution) దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రమాదకర స్థితిలో పెరిగిపోవడంతో నియంత్రణకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud seeding) విధానంలో కృత్రిమ వర్షాన్ని (Artificial Rain) కురిపించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఐఐటీ కాన్పూర్‌ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌ 20-21 తేదీల్లో దీనికి అనుకూలమైన వాతావరణం ఉండవచ్చని అంచనా వేసింది. క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిలో కృత్రిమ వర్షాన్ని కురిపించి కాలుష్యానికి చెక్‌ […]

Delhi – 13 నుంచి సరి-బేసి విధానం

ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన కాలుష్య నియంత్రణకు దిల్లీలో ఈ నెల 13 నుంచి  వాహనాలకు సరి-బేసి అంకెల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది ఈ నెల 20 వరకూ కొనసాగనుంది. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివరన సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి అంకె ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి అనుమతిస్తారు. ఈ మేరకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వం పేర్కొన్న రక్షణ స్థాయులకు ఏడెనిమిది రెట్ల కాలుష్యం […]

Delhi – ట్రక్కుల ప్రవేశంపై నిషేధం

దేశ రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచీలు క్షీణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాయు కాలుష్య నియంత్రణకు నాలుగో దశ కింద కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా దిల్లీలోకి అత్యవసర సేవలను అందించే వాహనాలు మినహా వాయు కాలుష్య కారక ట్రక్కులు, నాలుగు చక్రాల వాణిజ్య వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌ 4 వాహనాలను మాత్రమే రాజధాని ప్రాంతంలోకి అనుమతించాలని పేర్కొంది.. హైవేలు, రోడ్లు, […]

Pollution: దిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు..

దేశ రాజధాని దిల్లీ( Delhi) కాలుష్యం కోరల మధ్య నలిగిపోతోంది. వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504కి చేరింది. అయితే, జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిచేస్తోంది. విషపూరిత పొగమంచు దేశ రాజధానిని కమ్మేసింది. ఈ పరిస్థితుల మధ్య ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది. దిల్లీలో […]

IIIT Delhi – వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేసింది.

చిన్న పిల్లల వైద్యులకు శిక్షణనిచ్చేందుకు దిల్లీ ఐఐఐటీ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ విద్యా సంస్థకు చెందిన మెడికల్‌ రోబోటిక్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలోని మావెరిక్‌ కంపెనీ సిలికాన్‌తో నవజాత శిశువు ‘లూసీ’ బొమ్మను రూపొందించింది. ఇప్పటి వరకు వైద్యులు, వైద్య విద్యార్థులకు ప్లాస్టిక్‌ బొమ్మలపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు సిలికాన్‌ సిమ్యులేటర్‌ బేబీ అయిన లూసీని ఉపయోగిస్తారు. దీని ద్వారా అన్ని రకాల వైద్య చికిత్సలను సులభంగా అభ్యసించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెడికల్‌ రోబోటిక్స్‌ సెంటర్‌.. […]