India Defense Minister’s Warnings : పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: రక్షణమంత్రి హెచ్చరికలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని.. అవసరమైతే పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. బ్రిటన్ పత్రిక గార్డియన్ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. […]