IPL : Sunrisers won on Chennai: చెన్నై పై సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది
సొంతగడ్డపై సన్‌రైజర్స్ సత్తాచాటింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్ దూబె (45; 24 బంతుల్లో […]