Raghunandan rao: ‘‘ఈ నా గొంతుని కాపాడండి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఈరోజు మోసపోయి మీరు ఆగం కావొద్దు’’

Telangana: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కలెక్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. సిద్దిపేట, […]

CM Revanth Reddy : లక్ష్మీనృసింహుడి సాక్షిగా చెబుతున్నా.. పంద్రాగస్టులోగా 2లక్షల రుణమాఫీ

‘యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నా..! ఏది ఏమైనా సరే.. పంద్రాగస్టులోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే పంట నుంచే వరికి రూ.500 బోనస్‌ ఇచ్చి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నా..! ఏది ఏమైనా సరే.. పంద్రాగస్టులోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే పంట నుంచే వరికి రూ.500 బోనస్‌ ఇచ్చి, […]

Fire To The TDP Office In Palnadu District  : పూర్తిగా దగ్ధమైన టీడీపీ ఆఫీసు

పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయం కాలి బూడిదైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నాయకుల్లో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. ఇదే క్రమంలో బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నిగుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.

MLC Kavitha ED Case : ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. 

ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. అలాగే కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో […]

Nomination of Yarapatineni Srinivas Rao : యరపతినేని శ్రీనివాస్ రావు నామినేషన్

ఈ రోజు ( ఏప్రిల్ 22 ) ఉదయం 10 . గం .. లకు యరపతినేని శ్రీనివాస్ రావు ( మంచికల్లు శ్రీనన్న ) గురజాల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురజాల లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గురజాల నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిమంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం యరపతినేని శ్రీనివాసరావు కోరారు.

TDP Gurazala Party Joinings : TDP పార్టీలో చేరిన 170 కుటుంబాలు

రజాల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల పట్టణ మరియు మండలంలోని వివిధ సామాజిక వర్గాలకి చెందిన 170 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గార్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది పార్టీలోకి చేరిన వారు : గురజాల పట్టణం గడిపూడి చెన్నయ్య (మాజీ సర్పంచ్), నవులూరి పుల్లారావు, […]

TDP Gurazala : చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు …….

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, పార్టీ సీనియర్ నాయకులు డా. ఉన్నం నాగమల్లేశ్వరరావు గారు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేకును కట్ చేసి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది

Ycp Candidate Rk Roja Files Nomination In Nagari Constituency : నగరిలో మంత్రి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు.. 

Andhra Pradesh Elections 2024: నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నగరిలోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. నగరి క్లాక్ టవర్ వద్ద మంత్రి రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే […]

Telangana Cm Revanth Reddy : రుణమాఫీ పై  రేవంత్….

పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను అయ్య, మామ పేరు చెప్పుకుని అధికారంలోకి రాలేదని.. బరాబర్ జనంలో నుంచి వచ్చినట్లు తెలిపారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోగా చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పదేళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తల అండతో కుర్చీపై […]

TDP GURAZALA : టీడీపీ లో భారీగా చేరికలు

పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు దాచేపల్లి మండలం నడికుడి గ్రామం BC- వడ్డెర (వడియారాజుల) సామాజిక వర్గానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది పార్టీలోకి చేరిన వారు : పల్లపు కృష్ణ, పల్లపు శ్రీనివాసరావు, పల్లపు కోటేశ్వరరావు, పల్లపు శంకర్ శివ, పల్లపు […]