Baltimore bridge collapse: అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!

బాల్టిమోర్‌లో కుప్పకూలిన వంతెన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన వంతెన ప్రమాదంలో (Baltimore bridge collapse) గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్‌ రవాణాశాఖ కార్యదర్శి పాల్‌ వైడెఫెల్డ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతు, కనిపించకుండా పోయిన […]