China Robo Dogs Wih Gun : శునకంపై ఓ ఆటోమేటిక్‌ రైఫిల్‌

చైనా సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఈ మర శునకంపై ఓ ఆటోమేటిక్‌ రైఫిల్‌ను అమర్చారు. లక్ష్యంపై గురితప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా […]

Nawaz Sharif: Former Pakistan Prime Minister Nawaz Sharif in China.. చైనాలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్..

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నారు. సోమవారం బీజింగ్ చేరుకున్న ఆయన.. ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటనగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. స్థానిక మీడియా వర్గాల సమాచారం మేరకు వైద్య పరీక్షల నిమిత్తం నవాజ్ షరీఫ్ చైనాకు వెళ్తున్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నారు. సోమవారం బీజింగ్ చేరుకున్న ఆయన.. ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటనగా […]

China: China has not changed its mind.. బుద్ధి మార్చుకోని చైనా.. అరుణాచల్‌లో మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు

China: పొరుగుదేశం చైనా తన బుద్ధి మార్చుకోలేదు. మన భూభాగంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరో 30 ప్రాంతాలకు డ్రాగన్‌ కొత్త పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) తమదేనంటూ వితండవాదం చేస్తున్న డ్రాగన్‌.. మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ […]

Arunachal Pradesh belongs to India.. America is a strong counter to China.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దే.. చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్

అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూ భాగంగా తాము గుర్తించామని..వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూ భాగంగా తాము గుర్తించామని..వాస్తవాధీన […]

Baby born with 4 inch tail in China : బ్రహ్మంగారు చెప్పి వింతలు సాక్షాత్కారం.. చైనాలో 4 అంగుళాల తోకతో పుట్టిన శిశువు

కొన్ని సార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్‌జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జన్మించిన శిశువు వెనుక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు […]

America Given Big Shock To China చైనాకు గట్టిషాకిచ్చిన అమెరికా..టిక్ టాక్ బ్యాన్

డ్రాగన్ కంట్రీకి గట్టిషాకిచ్చింది అమెరికా. చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధించే బిల్లుకు అమెరికా హౌస్ ఆమోదం తెలిపింది. టిక్ టాన్ నిషేధించే ఈ బిల్లు భారీ మెజార్టీతో ఆమోదిస్తూ.. యుఎస్ హౌస్ చైనాకు బలమైన సందేశాన్ని ఇచ్చింది. రాజకీయంగా విభజించిన వాషింగ్టన్‌లో, టిక్‌టాక్‌ను నిషేధించే విషయంలో అద్భుతమైన ద్వైపాక్షిక ఐక్యత ఉంది. ఎంపీలు ప్రతిపాదిత చట్టానికి అనుకూలంగా 352 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 65 మంది మాత్రమే ఓటేశారు. అమెరికా ప్రతినిధుల సభ బుధవారం […]

Huge explosion in China.. Buildings Collapsed

చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్‌ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి  మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది.  ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి […]

India-China news : అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు: చైనాకు భారత్‌ చురక

ప్రధాని మోదీ ‘అరుణాచల్‌’ పర్యటనపై నోరు పారేసుకున్న చైనాకు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ‘మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ’ డ్రాగన్‌కు చురకలంటించింది. దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో పర్యటించడంపై చైనా (China) తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నోరుపారేసుకున్నారు. ఈ విషయమై […]

China : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతిపాదన.

సైనిక ఉపగ్రహాలు, రక్షణ టెక్నాలజీల్లో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకుందామని చైనాకు రష్యా ప్రతిపాదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నందున మరింతగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. బుధవారం చైనా సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ జెన్‌ ఝాంగ్‌ యుక్సియాతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడారు. ‘అంతరిక్షంతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వంటి విలువైన ఆస్తుల్లో, భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఆయుధాల విషయంలో సహకరించుకోవడం ద్వారా రెండు దేశాల వ్యూహాత్మక […]

China : ప్రమాదానికి గురైన జలాంతర్గామి

ఎల్లో సముద్ర జలాల్లో చైనాకు చెందిన ఓ అణు జలాంతర్గామి ప్రమాదానికి గురై అందులోని 55 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సబ్‌మెరైన్లు తమ క్వింగ్‌డావ్‌ నౌకాదళ స్థావరం ప్రాంతంలోకి ప్రవేశించకుండా సముద్రం అడుగున చైనా నిర్మించిన గొలుసుల ఉచ్చులోనే ఆ దేశ జలాంతర్గామి చిక్కుకుని ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై బ్రిటన్‌కు చెందిన పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ‘‘చైనాలోని షాండాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎల్లో […]

  • 1
  • 2