Encounter in Chattisgarh.. 8 Maoists killed ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం. గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన నక్సల్స్ మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్జీ, […]