Chhattisgarh- మావోయిస్టుల ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేరు జిల్లాలోని తడోకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు-భద్రతా బలగాల మధ్య ఆదివారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఆర్జీ, బీఎస్‌ఎఫ్‌ భద్రతా బలగాలు తడోకీ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు వీరికి తారసపడి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు ఆత్మరక్షణకు తిరిగి కాల్పులు ఆరంభించడంతో మావోయిస్టులు గాయాలపాలై అక్కడినుంచి తప్పించుకు వెళ్లిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోని మావోయిస్టు […]