Asaduddin Owaisi’s – వ్యాఖ్య:చంద్రుడు హ్యాపీగా జైల్లో.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారని, అక్కడ ఆయన ప్రశాంతంగా ఉన్నారని, చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ పాలన మంచిగానే ఉందని, చంద్రబాబును మాత్రం నమ్మలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు  ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ తమ పార్టీ గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

IT employees and TDP ranks protested in the city of Chennai on Tuesday – మంగళవారం చెన్నై నగరంలో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు, తెదేపా శ్రేణులు చెన్నై నగరంలో మంగళవారం ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న వల్లువర్‌కోట్టం నిరసన మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకుని నల్ల కండువాలు వేసుకుని, ప్లకార్డులతో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకోసం ఐటీ ఉద్యోగులు సెలవుపెట్టి వచ్చినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నామని, చంద్రబాబు పాలనలో తమకు మేలే జరిగిందన్న అభిప్రాయాలను వ్యక్తంచేశారు. చంద్రబాబు అరెస్టు దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో […]

Farmers and fans gathered to oppose Chandrababu’s arrest – చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తరలివచ్చిన రైతన్నలు, అభిమానులు

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో తెలుగు ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వేలసంఖ్యలో కర్షకలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్‌, భాజపా, జేడీఎస్‌ పార్టీల స్థానిక నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాలో  తుగ్లక్‌ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టుపై పోరాటానికి సింధనూరు తెలుగు ప్రజలు రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకుని మంగళవారం ఉదయం ఒక్కసారిగా క్లబ్‌ కాకతీయకు ప్రదర్శనగా […]