Tesla – భారత్‌కు కార్లు.. వయా జర్మనీ

టెస్లా సంస్థ జర్మనీలోని తమ గిగాఫ్యాక్టరీ నుంచి భారత్‌కు విద్యుత్‌ కార్లను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. చైనాలోని షాంఘైలోనూ గిగాఫ్యాక్టరీ ఉన్నా, అక్కడ నుంచి విద్యుత్‌ కార్ల దిగుమతికి భారత అధికారులు ససేమిరా అనడంతో టెస్లా ఈ యోచన చేస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ ‘మనీకంట్రోల్‌’  పేర్కొంది. టెస్లాకు ఐరోపాలో తొలి ఫ్యాక్టరీ కూడా జర్మనీ గిగాఫ్యాక్టరీనే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన టెస్లా, 25,000 డాలర్ల (రూ.20 లక్షలపైన) కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని […]