Canada : వీసా సేవల్ని పునరుద్ధరించనున్న భారత్..
ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన ఉద్రిక్తతలతో కెనడా పౌరులకు ఇటీవల భారత్ వీసా సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో వీసా సేవల్ని పునరుద్ధరిస్తూ ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల్లో మాత్రమే ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్లు స్పష్టంచేసింది. భద్రతా పరిస్థితులపై సమీక్ష […]