India – భారత్‌లో తొలి C-295 విమానం ల్యాండ్
భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తొలి సి-295 రవాణా విమానం గుజరాత్ వడోదరలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. బహ్రెయిన్ నుంచి గ్రూప్ కెప్టెన్ పీఎస్ నేగి దీన్ని నడుపుకొని వచ్చారు. దక్షిణ స్పెయిన్ నగరం సెవిల్లే నుంచి ఈ నెల 15న బయలుదేరిన ఈ విమానం ఈజిప్టు, మాల్టా, బెహ్రెయిన్‌లో ఆగి.. బుధవారం వడోదరలోని ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. ఈ నెల 13న భారత వైమానిక దళపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ఎయిర్‌బస్ సంస్థ […]