Nalgonda : బడి అంటేనే భయం!

ఇది భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. గతేడాది ఆగస్టులో ‘మన ఊరు – మన బడి’ పథకం కింద ఇక్కడ గుత్తేదారు చేపట్టిన ఇప్పటికీ పూర్తి కాలేదు. కార్యాలయ గదితో పాటు మరో గదికి మరమ్మతులు పూర్తిచేశారు. మరమ్మతులు పూర్తిచేసిన గదిలో గుత్తేదారు నిర్మాణ సామగ్రిని భద్రపరుచుకున్నారు. గత్యంతరం లేకపోవటంతో విద్యార్థులను శిథిలావస్థకు చేరిన గదిలోనే కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడతాయోనని ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. […]