Bomb Blast In Cyria : సిరియాలో బాంబు పేలి.. ఏడుగురు చిన్నారులు మృతి

డెమాస్కస్‌: సిరియాలో కల్లోలిత దరా ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలిన ఘటనలో ఏడుగురు చిన్నారులు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బాంబు పేలుడుకు బాధ్యులెవరో తెలియా ల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దరా ప్రావిన్స్‌లో జరిగిన వివిధ ఘటనల్లో 100 మందికి పైగా చనిపో యారు. ఇజ్రాయెల్‌ ఆక్రమిత గొలాన్‌ హైట్స్, జోర్డాన్‌కు మధ్యలో దరా ప్రావిన్స్‌ ప్రాంతముంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధానికి బీజం పడిందిక్కడే. 

Israeli airstrikes on Gaza hospital : గాజా తాత్కాలిక ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. డెయిర్‌ అల్‌-బలా: మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పాత్రికేయులతో సహా 15 మంది గాయపడ్డారు. యుద్ధ కల్లోలిత ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందతున్నారు. దాడితో మహిళలు, […]