Lok Sabha Election 2024: 7th Phase Final Stage Polling ….తుది అంకానికి చేరుకున్న లోక్‌సభ ఎన్నికలు..

ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడోవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 57 లోక్‌‌సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఒడిశాలోని మిగిలిన 42 అసెంబ్లీ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈరోజే ఓటింగ్ జరగనుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. […]

Union Home Minister Amit Shah visited Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్‌షాకు శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఈవో అందజేశారు.

Prajwal Revanna Arrested : బెంగళూరులో బిగ్‌ ట్విస్ట్‌.. విదేశాల నుంచి రాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌

బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్‌ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు. అక్కడ దిగిన వెంటనే ఆయన్ను​ ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్‌) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు. పలువురు మహిళలపై ప్రజ్వల్‌ లైంగిక దాడి చేసినట్లు […]

Raghunandan Rao: భారాస ఖాతాను వెంటనే ఫ్రీజ్‌ చేయాలి: భాజపా నేత రఘునందన్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారాసపై భాజపా మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారాసపై భాజపా మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ ఎన్నికల్లో రూ.30కోట్లతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖలు రాశారు. ఓ బ్యాంక్‌లోని భారాస అధికారిక ఖాతా […]

BJP Focus On Telagnana Aim To Win : తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది.

డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల నామినేషన్‌కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. అలాగే అగ్రనేతలతో కూడా ఎక్కువ సభలు నిర్వహించి.. 10కిపైగా ఎంపీ సీట్లు గెలవాలని రాష్ట్ర నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల నామినేషన్‌కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. అలాగే […]

Raghunandan rao: ‘‘ఈ నా గొంతుని కాపాడండి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఈరోజు మోసపోయి మీరు ఆగం కావొద్దు’’

Telangana: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కలెక్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. సిద్దిపేట, […]

Maoist Warning To BJP About Encounter : బీజేపీ నేతలు ఎన్‌కౌంటర్‌కు తగిన మూల్యం చెల్లించుకుంటారని మావోయిస్టు పార్టీ హెచ్చరిక…

చత్తీస్‌ఘడ్‌‎లోని కంకేర్‌ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి కచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపుదాడి చేశారు.  నార్త్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ సమావేశం గురించి కచ్చితమైన ఇంటెలిజెన్స్‌ సమాచారంతోనే భద్రతా బలగాలు దాడి చేశాయి. గత నెల రోజుల నుంచి మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు. చత్తీస్‌ఘడ్‌‎లోని కంకేర్‌ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి కచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపుదాడి […]

BJLP leader Maheswara Reddy : రేవంత్ మరో గజిని…. బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో గజిని.. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బీజేఎల్పీ నేత ఏలేటి‌ మహేశ్వరరెడ్డి (Maheshwar Reddy) ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో గజిని.. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బీజేఎల్పీ నేత ఏలేటి‌ మహేశ్వరరెడ్డి (Maheshwar Reddy) ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు ఆయన ABNతో మాట్లాడుతూ… లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో రేవంత్‌కు రైతులపై కపట ప్రేమ కలిగిందన్నారు. అద్రతాభావంతో రేవంత్ బీజేపీ, […]

Prime Minister Modi released the BJP pamphlet. బీజేపీ కరపత్రాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ..

గత 10 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం విడుదల చేసింది కమలం పార్టీ. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజ్‎నాథ్‎సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యమైన అంశాలను చాలా ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ కమలం కరపత్రం అనేక చర్చలకు దారి తీస్తోంది. గత పదేళ్లలో చేసిన సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా […]

Andhra Pradesh Politics : ఏపీలో ఎన్డీఏ నేతల భేటీ కీలక అంశాలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్‎ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీయే కూటమి.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు తర్వాత కూటమిలో మొదలైన అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల అభ్యర్థుల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులకు సహకరించేది లేదని మిత్రపక్షాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‎ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీయే కూటమి.. ఎప్పటికప్పుడు […]