CHESS ARJUN : భారత నంబర్‌వన్‌గా అర్జున్‌

 హైదరాబాద్‌: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్‌ విభాగం క్లాసికల్‌ ఫార్మాట్‌లో అధికారికంగా భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌గా అర్జున్‌ అవతరించాడు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్‌ ఫార్మాట్‌ రేటింగ్స్‌లో 20 ఏళ్ల అర్జున్‌ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించి భారత టాప్‌ […]