ఏపీ మహిళల అకౌంట్‌లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.18,750
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళుతున్నారు. గురువారం ఆయన వైఎస్సార్ చేయూత పథకం కింద నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోట చేరుకుంటారు.. అక్కడినుంచి పిసినికాడ చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేసి.. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. […]