AP Politics YS.Sharmila :  మేనత్త వైఎస్ విమలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేనత్తకు వయసు మీద పడిందని.. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ ఉండొచ్చని స్పష్టం చేశారు. కడప జిల్లా: మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మేనత్తకు వయసు మీద పడింది. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతుంది. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా […]

Congress Chief YS. SHARMILA : కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహి స్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల […]

AP Politics: లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌పై సీఈసీ టీడీపీ లేఖ

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ వస్తున్న వార్త రాష్ట్రంలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. లోకేష్ ఫోన్‌ను గుర్తు తెలియని సాఫ్ట్ వేర్‌లతో ఫోన్‌ను హ్యాకింగ్, ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందంటూ యువనేతకు ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపింది. ఈ వ్యవహారాన్ని టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్ […]

Congress Lok Sabha and Assembly candidates in AP. ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే.

దిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడదుల చేశారు.

YCP MLA joined Congress : కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే – YS. SHARMILA

నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అమరావతి: నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ప్రకటించిన వైకాపా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరారు. నందికొట్కూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

Congress list on 25th of this month.. Sharmila as Kadapa MP candidate..?ఈ నెల 25న కాంగ్రెస్‌ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌ కసరత్తును ముమ్మరం చేసింది. అమరావతి :  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్ఠానం.. ఈ నెల 25న జాబితా విడుదల చేయనుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. కడప లోక్‌సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప […]

AP Politics: 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం.. ఇక సింహాల్లా పోరాడాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా హోదా రాలేదన్నారు. పదేళ్ల నుంచి ఆంధ్రవారిని అధికార పార్టీలు గొర్రెలను చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం సింహాల మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. హోదా గురించి తలచుకొని షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి […]

YS Sharmila: జగన్‌ ‘విశాఖ విజన్‌’ ప్రకటనపై షర్మిల సెటైర్లు.

అమరావతి: ‘విశాఖ విజన్‌’ పేరుతో సీఎం జగన్‌ (YS Jagan) చేసిన ప్రకటనపై ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘‘పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం […]