Rafah: రఫా నడిబొడ్డుకు ఇజ్రాయెల్‌

దక్షిణ గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) చొచ్చుకొనిపోతున్నాయి. తొలుత శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. జెరూసలెం: దక్షిణ గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) చొచ్చుకొనిపోతున్నాయి. తొలుత శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో హమాస్‌ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు ఐడీఎఫ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మందుపాతర పేలి ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు బుధవారం ఐడీఎఫ్‌ తెలిపింది. […]